సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ. రెండు లక్షల రుణమాఫీ చేశారని, వారికి రైతులు రుణపడి ఉంటారని వారన్నారు.