రాయపోల్: అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్ పోస్టులు, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ఎస్. రాజగోపాల్ రెడ్డి తెలిపారు. గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులకు, ఎంఎల్ టీ పోస్టుకు బి. ఫార్మసీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ లేదా ఎంఎల్టి అర్హతలు, ఎంపీహెచ్‌డబ్ల్యూ పోస్టుకు ఎంఎస్సీ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారు అర్హులు. కేజీబీవీ పాఠశాలలో మూడు అసిస్టెంట్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు 16వ తేదీ సాయంత్రం 4:00 గంటల లోపు దరఖాస్తులను అందజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్