సిద్ధిపేట జిల్లా అక్బర్పేటభూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధిపై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.