రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్ధిపేట జిల్లా అక్బరుపేట-భూంపల్లి మండలంలోని భూంపల్లికి చెందిన పాపని కిస్ట గౌడ్ కు సీఎం సహాయక నిధి కింద మంజూరైన చెక్కును అందజేశారు. ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందిన కిస్ట గౌడ్, తన హాస్పిటల్ బిల్లుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగయ్య గారి జన్నారెడ్డి రెడ్డి, ఉపసర్పంచ్ బాల్శెట్టి అనూష నందం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయక నిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ సూచించారు.