సిద్దిపేట జిల్లా దుబ్బాక రూరల్ మండలం పెద్ద గుండవెల్లి శ్రీ రేణుక మాత ఆలయాన్ని దర్శించుకున్న సిద్దిపేట జడ్జ్ సాయి రమాదేవి , ఆషాడ మాసం సందర్భంగా బోనం సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్న జిల్లా జడ్జ్ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ గత 20 రోజుల క్రితం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరిక తీర్చినందుకుగాను ఈరోజు ఆదివారం బోనం చేయడం జరిగిందని, కోరిన కోర్కెలను ఇచ్చిన అమ్మవారిని స్మరించుకుంటూ, ఎంతో సంతోషం వ్యక్తం చేసిన జిల్లా జడ్జ్ సాయి రమాదేవి, జిల్లా ప్రజలతో పాటు దుబ్బాక పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు ఆషాడ బోనాల మాసం సందర్భంగా శ్రీ రేణుకా మాత ఆలయాన్ని దర్శించుకోవాలని ప్రజలకి, భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ సంతోష్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, క్యాషియర్ కొండ్ర యాదగిరి, శాశ్వత కార్యదర్శి చందిరి దుర్గారెడ్డి, సభ్యులు యాడవరం నాగరాజు, బోయ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ రాములు, అడ్వకేట్ పత్రి ప్రకాష్, వార్డ్ మెంబర్ దండు రాజు, గ్రామ పెద్దలు నక్కల దామోదర్ రెడ్డి, ఏర్వకిషన్, గౌటి రవి, సద్ది ప్రదీప్ రెడ్డి, చందిరి నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.