ఉపాధి హామీ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: డీఆర్‌డీఓ

సిద్దిపేట జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి జయదేవ్, ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించాలని, అందుకు అనుగుణంగా జాబ్ కార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్