విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏఈకి వినతి పత్రం అందజేత

సిద్ధిపేట జిల్లా వీరారెడ్డిపల్లి సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావుకు తమ గ్రామంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. గత 25 ఏళ్లుగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ప్రమాదాలు జరగకుండా వాటిని తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, పాడుబడిన స్తంభాలను సరిచేసి, విద్యుత్ వైర్లను మెరుగుపరిచి, తక్కువ వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఏఈ శ్రీనివాసరావు హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్