ఎస్సీల వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ అన్నారు. గురువారం సిద్దిపేటలో ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.