సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ నెల 9వ తేదీ గురువారం నుండి 11వ తేదీ శనివారం వరకు ప్రధాన గ్రామ దేవత శ్రీశ్రీ శ్రీ బొడ్రాయి నాభి శిల భూలక్ష్మి దేవి ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతోంది. ఇందులో భాగంగా నాభి శిలను ప్రధాన ముఖ ద్వారాల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో, బిందెలతో గంగను తీసుకొచ్చి నాభి శిలపై అభిషేకాలు చేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొని భగవంతుని తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించాలని కార్యనిర్వహణ కమిటీ సభ్యులు కోరారు. దుబ్బాక పట్టణంలోని అన్ని కుల సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.