సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో గొర్రెల పెంపకందారుడు మల్లేశం యాదవ్ కు చెందిన 70 నాటు కోళ్లను గుర్తు తెలియని దుండగులు మందు పెట్టి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 50 వేల రూపాయల విలువైన కోళ్లు మృతి చెందడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని, ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై హరీష్ గౌడ్ వివరాలు ఆరా తీస్తున్నారు. వెటర్నరీ అధికారులకు కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది.