బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన సత్తు తిరుమల్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వా లక్ష్మినర్సయ్య ఉత్తర్వులు జారీ చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ముందుండి ఉద్యమాలు నిర్వహించే తిరుమలరెడ్డి గతంలో సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుగా పని చేశారు. ఈ సందర్భంగా తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం చేస్తానని, రైతులలో బీజేపీని మరింత విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.