తోగుట: మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన గ్రామస్తులు

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డిని బండారుపల్లి గ్రామస్తులు ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌లు కుంబం బాల్ రెడ్డి, శారద తదితరులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు శంకర్రెడ్డి, స్వామి, ఎల్లయ్య, శారతి, లక్ష్మి, సరోజ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్