టూ బీహెచ్ కే ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలి

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్‌లోని హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, దుబ్బాక నియోజకవర్గంలో పూర్తయిన టూ బీహెచ్ కే ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని ఆయన కోరారు. గతంలో నిర్మించిన ఏడు మండలాలకు సంబంధించిన బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కొందరు లబ్ధిదారులు ఇప్పటికే రెండు నుండి రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇళ్లలో నివసిస్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్