పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలని తెలిపారు. 11 వార్డులోని కాల్లకుంట్ల కాలనీలో కౌన్సిలర్ దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ కలిసి ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.