దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం చేగుంట మండలం కొత్త వాల్య తండాలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, తండా అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి మౌలిక వసతిని కల్పించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తండాల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని, గ్రామీణ ప్రాంతాల పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.