సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ, నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య పాత్ర చిరస్మరణీయమని, ఆయన చిందించిన రక్తపు చుక్కే తెలంగాణ ఉద్యమానికి మహా జ్వాలగా మారిందని, పీడిత ప్రజల విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడని కొనియాడారు.