గణేష్ నగర్ కాలనీలో అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహణ

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞాపూర్ గణేష్ నగర్ కాలనీలో వినాయక నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కాలనీలో నవరాత్రోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕