కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప-కామరతి కల్యాణం అంగరంగ వైభవంగా

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండల కేంద్రమైన కుకునూర్ లో సోమవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప-కామరతి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గత రెండు రోజులుగా మంద పోచమ్మ పూజ, దేవుని మహిళలు తీయడం, గద్దెగొర్రెను కోయడం, బియ్యం సుంకుపట్టడం, గంగకు వెళ్లడం, రాత్రి లగ్నం, బోనాలు తీయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లం కునుకవ్వ ఐలయ్య, మాజీ సర్పంచ్ బోటపట్ల ఐలం శివ, మాజీ ఎంపిటిసి ఇండ్ల కనకయ్య, బిసి సంఘం అధ్యక్షుడు కందూరి ఐలయ్య, కురుమ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్