గజ్వేల్ లోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రెండవ అంగడివాడి సెంటర్ లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ, శిశువుకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారం, తొలి రక్షణ కవచమని తెలిపారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లా మహిళా–శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కె శ్రీనివాస్, పోషన్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ కిరణ్ పాల్గొన్నారు.