సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక శివాలయంలో శివమాల ధరించిన శివ స్వాములకు శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం పుస్తకాలను పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శివకుమార్, వినవెల్లి సతీష్, శివ భక్తులు పాల్గొన్నారు.