గజ్వేల్‌లో బుధవారం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీఏ స్పందన శ్రీనాథ్, సీఏ వీణలను శాలువాతో సత్కరించి అభినందించారు. దేశ ఆర్థిక ప్రగతిలో, పారదర్శకతతో చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకమని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు డాక్టర్ కుమారస్వామి అన్నారు. వారు నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.