ప్లాస్టిక్‌కు చెక్‌.. స్టీల్‌ పాత్రతో ఉపసర్పంచ్‌ ఆదర్శం!

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలనే సంకల్పంతో జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లి గ్రామ ఉపసర్పంచ్‌ నాగరాజు వినూత్నంగా ముందడుగు వేశారు. గ్రామంలోని చికెన్‌ సెంటర్‌కు వెళ్లిన ఆయన ప్లాస్టిక్‌ బాక్స్‌కు బదులుగా స్టీల్‌ పాత్రను తీసుకెళ్లి చికెన్‌ తీసుకున్నారు. ప్రజల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించేందుకు ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని గ్రామస్తులు అభినందించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కోసం కృషి చేయాలని నాగరాజు కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕