జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా చిలుకూరు మహేందర్ రెడ్

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా చిలుకూరు మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డిసిసి అధ్యక్షులు తూoకుంట ఆంక్ష రెడ్డి సహకారంతో మొత్తం 26 మంది ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలను నియమించారు. వీరిలో రెండవ స్థానంలో జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి మహేందర్రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి తనను గుర్తించి ఈ పదవి వచ్చేలా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్