ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన కట్టుకోవడానికి సుముఖంగా లేనివారు గ్రామ సభ నిర్వహించి వారి దగ్గర లెటర్ తీసుకొని వారి స్థానంలో అర్హులై నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. గురువారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు గ్రౌండింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాంక్షన్ పత్రాలు తీసుకున్న వారు మొదలు పెట్టాలన్నారు.