గద్దర్ 78వ జయంతి సభకు తరలిరండి: పులి కల్పన

ప్రజా యుద్ధ నౌక గద్దర్ 78వ జయంతి సభను శనివారం రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభను జయప్రదం చేయాలని కోరుతూ, శుక్రవారం తుకారాం గేట్ సాయినగర్‌లో కల్పన పోస్టర్‌ను విడుదల చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్