చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు గంగాధరి కనకయ్య ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు చెరుకు నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి ఆర్థిక సాయం అందించకపోవడం శోచనీయమన్నారు.