జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు, డాక్టర్ రాంజీ, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ నిహాల్ రెడ్డి, సింగాటం పశు వైద్యశాల డాక్టర్ గోపాలమిత్ర గౌరీ శంకర్, విఏ. కిరణ్, మహేందర్, భాస్కర్ గౌడ్, శంకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.