గజ్వేల్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18 మందికి రూ. 27, 500 జరిమానా

మద్యం తాగి పట్టుబడిన పలువురు వాహనదారులకు గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి బుధవారం జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సీఐ మురళీ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా 18 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 18 మందికి మొత్తంగా రూ. 27, 500 జరిమానా, ఒకరికి 2 రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్