సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బైకాడి హరికకు రూ. 13,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. మంజూరైన చెక్కును హరిక తండ్రి కిష్టయ్యకు మాజీ ఎంపీపీ పాండు గౌడ్, సర్పంచ్ భవాని బాలకిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉప సర్పంచ్ సుధాకర్, సీనియర్ నాయకులు కుమారి కర్ణాకర్, వార్డు సభ్యుడు లక్ష్మణ్ గౌడ్, చిన్నబోయిన మల్లేష్, మేకల శ్రీనివాస్, నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.