ప్రాజెక్టుల నిర్మాణంతో కేసీఆర్ హయాంలోనే సమృద్ధిగా సాగునీరు వచ్చిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మాట్లాడుతూ.. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మించి, మండుటెండల్లోనూ చెక్ డ్యామ్లు, చెరువులు, కుంటలు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.