గజ్వేల్‌: ఈత వనాన్ని నరికి వేసిన ఘటనపై గౌడ నాయకుల ఆగ్రహం

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో గౌడ సమాజానికి జీవనాధారమైన ఈత వనాన్ని నరికివేసిన ఘటనపై గౌడ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్న ఈత వనాన్ని కల్లు గీసే సమయానికే నరికివేయడం దురదృష్టకరమని, తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గౌడ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్