గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. శనివారం సీఐ సైదా వివరాల ప్రకారం.. కొడకండ్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి గజ్వేల్ నుంచి కొడకండ్లకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో రిమ్మనగూడ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు.