గజ్వేల్: శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామ శివారులో మంగళవారం గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అచ్చంగారి కృష్ణ (24) అనే యువకుడు మృతిచెందాడు. పని నిమిత్తం కొడకండ్ల వచ్చిన కృష్ణ, రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన కృష్ణ మృతదేహాన్ని పోలీసులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు, డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్