సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో సీఎంటీసీ (కమ్యూనిటీ మేనేజ్ ట్రైనింగ్ సెంటర్)ను ప్రారంభించిన డీఆర్డీవో జయదేవ్ ఆర్య, మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి మండల సమాఖ్యకు బస్సును ఇచ్చి, ధాన్యం కమీషన్ పెండింగ్ లేకుండా వెంటనే అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళలు సమాచారాన్ని తెలుసుకుని ఉన్నతంగా రాణించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.