సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, జీవో 11 ప్రకారం పని కల్పించాలని, విద్యార్హతల మేరకు కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు.