రెండు బైక్ లు ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన గజ్వేల్ పరిధిలోని కొల్లూర్ లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోళ్ల ప్రశాంత్, తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లికి చెందిన రాజిరెడ్డి కొల్గూరు శివారులో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదా తెలిపారు.