గజ్వేల్: విభేదాలు పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసేవారికే బీ-ఫారాలు అందజేశామని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్