గజ్వేల్: పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యము

కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమమేనని, గజ్వేల్ నియోజకవర్గంలో 3వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారని, మహిళల చేతుల్లోనే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే లక్ష్యంతో ప్రభుత్వ పథకాలను మహిళల పేరిటనే కేటాయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్