సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రాష్ట్ర మంత్రి వివేక్ 1109 మంది లబ్ధిదారులకు రూ. 11.9 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఇంటర్ కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.