జగదేవ్ పూర్: రైతులకు మద్దతుగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం స్థానిక సర్పంచ్ నర్సొళ్ల దీన రాజలింగం ప్రారంభించారు. రైతులకు సకాలంలో మద్దతు ధర అందించే ప్రభుత్వ కృషిలో ఇది కీలకమని, ఇకపై రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా వడ్లు అమ్ముకోవచ్చని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్