కొండపాక: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి

గురువారం సిద్దిపేట త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం, కొండపాక మండలం మర్పడగ గ్రామంలో అమిదిపురం రమేశ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. తల్లి సంవత్సరీకం కోసం అన్న, వదినతో కలిసి ఊర చెరువు వద్దకు వెళ్లిన రమేశ్, దుస్తులు ఉతుకుతూ చెరువులోకి దిగగా, ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. గ్రామస్థులు, పోలీసుల బృందం గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్