కొండపాక: గ్రామ గ్రామాన "మేడే" ను జయప్రదం చేయండి

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని ఉమ్మడి కొండపాక మండలంలోని అన్ని గ్రామాలలో ఎర్రజెండాలు ఎగరవేసి, కార్మికుల, ప్రజల హక్కులు ప్రతిబింబించేలా ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని సీపీఎం కొండపాక మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య కార్మికులు, రైతులు, కూలీలు, శ్రామిక ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం వెలికట్ట చౌరస్తా వద్ద విలేకరులతో మాట్లాడుతూ, సమ్మె చేసే హక్కు లేకుండా కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, దాని స్థానంలో కార్మిక వర్గాన్ని, ప్రజలను దోచుకునే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల హక్కులపై దాడి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్