చదువుకునే విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ అన్నారు. కొండపాక మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అడ్మిషన్ సాధించిన జె. హారికను ఆదివారం అధ్య కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మాధవి, డాక్టర్ బాలకిషన్, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకిషన్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో రాణించేందుకు పేద విద్యార్థులకు తనవంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.