కొండపాక: యువతీ, యువకులకు క్రీడల పట్ల ఆసక్తి ఉండాలి

చెడు అలవాట్లకు యువత దూరం ఉండాలని సిద్ధిపేట జిల్లా కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామంలో పిఏసిఎస్ డైరెక్టర్ బూర్గుల సురేంధర్ రావు, ఆరుట్ల సంపత్ కుమార్ లతో కలిసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ యువతీ, యువకులకు క్రీడల పట్ల ఆసక్తి ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్