గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి రిమాండ్ కు తరలింపు

గంజాయి కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో సొంతంగా మొక్క పెంచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ శ్రీనివాస్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎస్.కె. రాకీబుల్ అనే వ్యక్తి, లకుడారంలో అద్దెకు ఉంటున్నాడు. గంజాయి కొనుగోలు కష్టమని భావించి, విత్తనాలు సేకరించి ఇంటి వెనుక మొక్క నాటి పెంచుతున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్