సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధి దాచారం గ్రామంలోని స్వామి వారి గుడి నిర్మాణానికి బుధవారం మాజీ గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి రూ. 25 వేలు విరాళం అందించారు. మాజీ మంత్రి తన్నీరు హరిష్ రావు 54వ జన్మదినం సందర్భంగా ఈ విరాళం అందజేసినట్లు తెలిపారు. గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా దేవాలయ నిర్మాణానికి రూ. 2 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.