సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో నాభి శిల (బొడ్రాయి) విగ్రహ ప్రతిష్ఠ, గ్రామదేవతల పండుగలు ఆదివారం వైభవంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్ డీ సి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మర్కుక్ గ్రామం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణి మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.