గజ్వేల్‌లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం, పిల్లలకు చుక్కలు తప్పనిసరి

సిద్దిపేట జిల్లా, గజ్వేల్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్