సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గౌరారం, మట్టి మామిడి తదితర ప్రాంతాలలో కంకులు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాహనదారులు ఇట్టే తమ దృష్టిని కంకులు ఆకట్టుకోవడంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వాహనదారులు సైతం ఇష్టంగా కంకులను భారీగా తీసుకెళ్తున్నారు.