సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆపన్న హస్త మిత్ర బృందం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అన్న భావంతో చిరు వ్యాపారులు కలిసి ఈ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నెల సభ్యులందరూ రూ.200 చొప్పున జమ చేసి, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు.